విజయయాత్ర లో ”సప్తగిరి ఎక్స్ ప్రెస్”

96

మాస్టర్స్ హోమియో అధినేత డాక్టర్ రవి కిరణ్ సాయి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన సినిమా సప్తగిరి ఎక్స్ ప్రెస్. కమెడీయన్ సప్తగిరి హీరోగా నటించిన ఈ సినిమా ఇటీవలే విడుదలై ప్రేక్షకుల నుంచి విశేష స్పందనను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా సప్తగిరి ఎక్స్ ప్రెస్ చిత్ర యూనిట్ తెలుగు రాష్ట్రాల్లో విజయ యాత్ర నిర్వహిస్తోంది. ఈ టూర్ లో భాగంగా సప్తగిరి ఎక్స్ ప్రెస్ టీమ్ వెళ్లిన ప్రతి చోట వారికి ఫ్యాన్స్ నీరాజనాం పడుతున్నారు. ఇక రిలీజైన ప్రతి సెంటర్ లో భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయని, ఇంతటి ఊహించని విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు ఈ సినిమా టీం యూనిట్.

Saptagiri-Express

సినిమాటోగ్రాఫ్ రామ్ ప్రసాద్, ఎడిటర్ గౌతంరాజు ఈ సినిమాను తమ నైపుణ్యంతో ప్రేక్షకుల్ని ఆద్యంతం అలరించే విధంగా తీర్చి దిద్దారని డైరెక్టర్ అరుణ్ చెప్పారు. అలాగే హీరో సప్తగిరి కెరీర్ కు మంచి మైలేజ్ ఇచ్చే చిత్రంగా మిగలనుంది. విజయయాత్రలో సప్తగిరి తన డైలాగ్‌ లతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. విజయ యాత్రలో సినిమా కో ప్రొడ్యూసర్ : డాక్టర్ వాణి రవికరిణ్, సినిమాటోగ్రాఫర్ : సి.రామ్ ప్రసాద్, ఎడిటిర్ : గౌతంరాజు, క్రియేటివ్ హెడ్ : గోపాల్ అమిరశెట్టి, మాటలు : రాజశేఖర్ రెడ్డి పులిచర్ల పాల్గొన్నారు..

Saptagiri-Express