జీహెచ్‌ఎంసీ అధికారులతో కేటీఆర్ సమీక్ష…..

151
KTR review meeting today

రెండున్నర సంవత్సరాల్లో పురపాలనలో అనేక కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు తీసుకుని పోగలిగామని పురపాలక శాఖ మంత్రి కెటి రామరావు తెలిపారు. పురపాలన శాఖలోని వివిద శాఖాధిపతులతో బుద్దపూర్ణిమ ప్రాజెక్టు కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో మున్సిపల్ ఉద్యోగుల ఏకీకృత సర్వీసుల చట్టం, బిల్డింగ్ ట్రైబ్యూనల్ వంటి చట్టాలను తీసుకునివచ్చామని, వీటికి ప్రతిపక్ష పార్టీల నుంచి అభినందనలు వచ్చాయన్నారు. ఇప్పటికే అంశాలపై దృష్టి పెట్టి గుణాత్మకమై మార్పులు తీసుకుని వచ్చామన్నారు. గత ఏడాది పురపాలనలో తాగునీరు, పారిశుద్ద్య రంగాల్లో అనేక కార్యక్రమాలను చేపట్టామేని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూశామని మంత్రి కెటి రామారావు తెలిపారు. తమ ప్రభుత్వం పురపాలికల్లో మరింత అభివృద్ది చేసేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు.

KTR review meeting today

అందుకే ఈ నూతన సంవత్సరంలో టైం లైన్ల అధారంగా చేపట్టబోయే కార్యక్రమాలను శాఖాధిపతులు నిర్ధారించుకోవాలన్నారు. ఈ మేరకు దీర్ఘకాలిక కార్యక్రమాలు, పథకాల కోసం ప్రత్యేకంగా టైం లైన్లతోకూడిన లక్ష్యాలను నిర్ధేశించుకుని ముందుకు పోవాలన్నారు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల సేవలను సంపూర్ణంగా ఉపయోగించుకోవాలని, వివిధ కార్యక్రమాలను చేపట్టేందుకు ఇది దోహద పడుతుందన్నారు. ఈ మేరకు శాఖల వారీగా 15 రోజుల్లో నివేదికను ఇవ్వాలని అదేశించారు.

KTR review meeting today

గత రెండున్నర సంవత్సరాల్లో ఇచ్చిన పలు హమీలను, ప్రస్తుతం నడుస్తున్నకార్యక్రమాలను పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయాలన్నారు. రాష్ర్టంలోని అన్ని పురపాలికలను మే మాసంలో ఒపెన్ డిఫెకేషన్ ఫ్రీ ప్రాంతాలుగా ప్రకటించడం లక్ష్యంగా పనిచేద్దాం అన్నారు. అన్ని పురపాలికల్లో ఏల్ ఈ డీ లైట్ల భింగింపును ఈ ఉగాది నాటికి పూర్తి చేయలన్నారు. ప్రతి మున్సిపాలీటిల్లో ఒక్కో నర్సరీ ఏర్పాటు చేసేందుకు సిద్దంగా ఉండాలన్నారు. వివిధ శాఖలు(జియచ్ యంసీ, మున్సిపల్ శాఖ, యచ్ యండిఏ వంటి) కలిసి చేస్తున్న పలు కార్యక్రమాలను సమన్వయంలో పూర్తి చేయాలన్నారు.

 000

ప్రభుత్వం నుంచి పురపాలకలకు అసవరం అయిన ప్రతి సారి ప్రభుత్వం చేయూతనిస్తున్నదని తెలిపారు. వీటితోపాటు కార్యక్రమాలను అవసరమైన నిధులను అందిస్తుందని, ఇందుకోసం అవసరం అయితే అర్ధిక శాఖ మంత్రితో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిధుల వినియోగం పైన అవసరం అయిన సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, ఇతర శాఖాధిపతులు పాల్గోన్నారు.