భార్య చెంతకు హృతిక్ రోషన్‌..

112
Hrithik

బాలీవుడ్ తారల మద్య ప్రేమలు..విభేదాలు ఎక్కువ రోజులు నిలవని చాలా సార్లే ప్రూవ్‌ అయింది. కలుసుకున్నజంటలు విడిపోతారు. విడిపోయిన వారు..మళ్లీ దగ్గరవుతుంటారు. బాలీవుడ్ నటుడు హృతిక్ అతని భార్య సూసన ది కూడా సేమ్ ఇలాంటి సిచ్యువేషనే. పదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. పదేళ్లపాటు బాగానే ఉన్నారు. వీళ్లకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఉన్నట్టుండి ఏమైందో కానీ 2014లో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. మనస్పర్ధాలతో ఇద్దరు విడిపోయినా అవన్నీ పక్కకు పెట్టేసి పిల్లలకు మంచి తల్లిదండ్రులుగా ఉండాలనే ఉద్దేశంతో అప్పుడప్పుడూ కలుస్తున్నారు. టైం దొరికినప్పుడు ఇద్దరు కలిసి పిల్లలతో విహారయాత్రకు వెళతారు. తాజాగా హృతిక్‌, సూసన్‌ తాజాగా విహారయాత్రకు దుబాయ్‌ వెళ్లారు.

Hrithik
ఇటీవల దుబాయ్‌ రెస్టారెంట్‌లో ఇద్దరు కుమారులతో సహా కనిపించిన హృతిక్‌, సూసన్‌ తాజాగా విహారయాత్రకు. ఈ సందర్భంగా బీచ్‌లో దిగిన ఫొటోను సూసన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ.. చాలా సంతోషకరమైన రోజని పోస్ట్‌ చేశారు. హృతిక్, సూసన్ క్రిస్మస్‌ వేడుకలను తన ఇద్దరు పిల్లలతో కలిసి ఫ్రెంచ్‌ ఆల్ప్స్‌లో జరుపుకొన్నారు. ఈ సందర్భంగా మంచు కొండల్లో దిగిన ఫొటోను ఆయన ట్విట్టర్‌ ద్వారా పంచుకుంటూ.. క్రిస్మస్‌ శుభాకాంక్షలు చెప్పారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఇప్పుడీ కుటుంబం దుబాయ్‌ చేరింది. విడాకులతో దూరం అయినా హృతిక్, సూసన్ అప్పుడప్పుడు ఇలా పిల్లలతో కలిస్తుంటారు. దీంతో ఇద్దరి మధ్య మళ్లీ బంధం బలపడుతుందని..త్వరలో మళ్లీ ఒక్కటి కానున్నారని బాలీవుడ్ జనాలు చెవులు కొరుకుంటున్నారు. రీసెంట్‌గా కంగనాకు..హృతిక్ కు జరిగిన వివాదంలో..సూసన్ భర్తకు అండగా నిలిచిన విషయం తెలిసిందే.