యంగ్ హీరో నెలకో సినిమా

16
- Advertisement -

గతేడాది ఆది సాయి కుమార్ నుండి ఎక్కువ సినిమాలు వచ్చాయి. అలాగే కిరణ్ అబ్బవరం నుండి కూడా మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ఆ కేటగిరీలోకి సంతోష్ శోభన్ కూడా చెరబోతున్నాడు. తను నేను అనే సినిమాతో హీరోగా పరిచయమైన సంతోష్ శోభన్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. రెండు మూడు నెలల్లో ఒక్కో సినిమా రిలీజ్ చేస్తున్నాడు.

గతేడాది లైక్ షేర్ సబ్ స్క్రయిబ్ సినిమాతో నవంబర్ లో థియేటర్స్ లోకి వచ్చాడు సంతోష్. డిసెంబర్ లో గ్యాప్ ఇచ్చి జనవరిలో కళ్యాణం కమనీయం అనే సినిమాతో వచ్చాడు. ఇప్పుడు ఎక్కువ గ్యాప్ లేకుండా ఇదే నెలలో మరో సినిమాతో రాబోతున్నాడు. శ్రీదేవి శోభన్ బాబు అనే సినిమాతో ఫిబ్రవరి 18 న థియేటర్స్ లోకి రాబోతున్నాడు. ఇలా నాలుగు నెలల గ్యాప్ లో మూడు సినిమాలు రిలీజ్ చేయడం ఈ కుర్ర హీరోకే సాధ్యమైంది.

ఇక ఇదే ఏడాది అన్ని మంచి శకునములే అనే మరో సినిమాతో థియేటర్స్ లోకి రానున్నాడు. దీంతో ఈ ఏడాది సంతోష్ శోభన్ నుండి మూడు సినిమాలు రిలీజ్ అయినట్టే. ఇక ఇంకో సినిమా ఏమయినా శ్రీదేవి శోభన్ లా వచ్చి చేరితే నాలుగు సినిమాలతో 2023 లో రికార్డ్ కొట్టినట్టే. ఏ మాటకామాటే ఈ కుర్ర హీరో ఎన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన హిట్ అందుకోలేకపోవడం విచిత్రం.

ఇవి కూడా చదవండి..

- Advertisement -