ఓటీటీ : ఏ చిత్రం దేనిలో?

16
- Advertisement -

గత వారం థియేటర్స్ లో ఆరు సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ, ఒక్క రైటర్ పద్మభూషణ్ సినిమాకే పాజిటివ్ టాక్ వచ్చింది. అయినా, ఆ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ లేవు. ప్రతి వారం థియేటర్స్ లో వరుసగా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఇదే పరిస్థితి. అందుకే.. రోజురోజుకూ ఓటీటీల జోరు మాత్రం పెరుగుతూనే ఉంది. ఓటీటీ లలో వచ్చే కంటెంట్ కోసం ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్‌ కానున్నాయి. మరి వాటి లిస్ట్ ఏమిటో చూద్దాం రండి.

నెట్‌ఫ్లిక్స్‌ లో ప్రసారాలు ఇవే :
బిల్‌ రస్సెల్‌: లెజెండ్‌ (వెబ్‌సిరీస్‌) ఫిబ్రవరి 8 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
ద ఎక్స్ఛేంజ్‌ (హాలీవుడ్‌) ఫిబ్రవరి 8 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
యు (వెబ్‌సిరీస్‌-4) ఫిబ్రవరి 9 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
డియర్‌ డేవిడ్‌ (హాలీవుడ్‌) ఫిబ్రవరి 9 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
యువర్‌ ప్లేస్‌ ఆర్‌ మైన్‌ (హాలీవుడ్‌) ఫిబ్రవరి 10 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
టెన్‌ డేస్‌ ఆఫ్‌ ఎ గుడ్‌మాన్‌ (హాలీవుడ్‌) ఫిబ్రవరి 10 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
తెగింపు ఫిబ్రవరి 08వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

డిస్నీ+హాట్‌స్టార్‌ లో ప్రసారాలు ఇవే :
నాట్‌ డెడ్‌ ఎట్‌ (వెబ్‌సిరీస్‌) ఫిబ్రవరి 09 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
హన్నికాస్‌ లవ్‌ షాదీ డ్రామా (రియాల్టీ షో) ఫిబ్రవరి 10 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
రాజయోగం ఫిబ్రవరి 09వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

సోనీలివ్‌ లో ప్రసారాలు ఇవే :
నిజం విత్‌ స్మిత (టాక్‌ షో) ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ఆహా లో ప్రసారాలు ఇవే :
కళ్యాణం కమనీయం ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో లో ప్రసారాలు ఇవే :
ఫర్జీ ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ఇవి కూడా చదవండి…

కుటుంబంతో చూసే సినిమా:మహేష్‌

జైలర్‌…ష్రాఫ్ ఎంట్రీ

కుటుంబ కథాచిత్రం.. ‘రైటర్ పద్మభూషణ్‌’

- Advertisement -