- Advertisement -
కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమీషన్ నివేదికపై హైకోర్టు తీర్పు హర్షణీయం అన్నారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. హైకోర్టు తీర్పుతోనైనా కాంగ్రెస్ కక్షపూరిత విధానాలను మార్చుకొని బుద్ది తెచ్చుకోవాలి …తెలంగాణ జీవధార కాళేశ్వరం మీద నిందలు మోపి బీఆర్ఎస్ , కేసీఆర్ ప్రతిష్ట దెబ్బ తీసేందుకు కాంగ్రెస్, బీజేపీ వాడుకున్నాయి అన్నారు.
రెండున్నరేళ్లు మరమ్మతులు చేపట్టకుండా అడ్డుకున్నారు..చివరకు గత్యంతరం లేక మరమ్మతులు చేపడుతున్నారు అన్నారు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్ మీద చేసిన ఆరోపణలకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెలంగాణ ప్రజలకు, రైతాంగానికి క్షమాపణలు చెప్పాలి అన్నారు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.
Also Read:పిల్లలకు మాటలు ఆలస్యమవ్వడం ఆటిజమా?
- Advertisement -

