కన్నులపండుగగా వైకుంఠ ఏకాదశి వేడుకలు..

57
- Advertisement -

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారంలోని శ్రీ ఆది మహావిష్ణు ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు కన్నులపండుగగా జరిగాయి. అంగరంగ వైభవంగా జరిగిన స్వామి వారి కల్యాణ మహోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థాన పూజారుల బృందంచే కళ్యాణ మహోత్సవాలు జరిగాయి. వేకువజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు దేవాలయానికి చేరుకొని స్వామివారిని వైకుంఠ ద్వారం గుండా దర్శించుకుoటున్నారు.

సూర్యుడు ఉత్త రాయణానికి మరే ముందు వచ్చే మార్గశిర శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి, లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున సాక్షాత్తు మహావిష్ణువు గరుడవహనంపై ముకోటి దేవతలతో భూలోకానికి వేంచేసి భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ వాకిళ్ళు తెరుచుకొని ఉంటాయి అందుకే భక్తులు వైకుంఠ ద్వారం ద్వారా స్వామి వారిని దర్శించుకొని పాపవిముక్తులు అవుతారు అని ఇక్కడి భక్తులు తెలుపుతున్నారు.

- Advertisement -