వెంకీ, వ‌రుణ్ తేజ్ లు చాలా బాగా న‌టించారుః మ‌హేశ్ బాబు

217
mahesh babu
 విక్ట‌రీ వెంక‌టేశ‌, వ‌రుణ్ తేజ్ క‌లిసి న‌టించిన సినిమా ఎఫ్2. యువ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఈచిత్రాన్ని తెర‌కెక్కించారు. సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న థియేట‌ర్ల ముందుకు వ‌చ్చిన ఈమూవీ మంచి హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఈ సినిమాలో తమన్నా, మెహరీన్ కథానాయికలుగా నటించారు. చాలా రోజుల త‌ర్వాత మంచి కామెడీ సినిమా చూశామ‌ని చెబ‌తున్నారు వీక్ష‌కులు. ప్ర‌స్తుతం బాక్సాఫిస్ వ‌ద్ద కూడా ఈచిత్రం మంచి కలెక్ష‌న్ల‌ను రాబ‌డుతోంది.
f2
 ఈసినిమా చూసిన ప‌లువురు సెల‌బ్రెటీలు చిత్ర‌యూనిట్ ను ప్ర‌శంసిస్తున్నారు. తాజాగా ఈమూవీని చూసిన సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు చిత్ర‌యూనిట్ ను అభినందించారు. ట్వీట్ట‌ర్ వేదిక‌గా స్పందిస్తూ..f2 సినిమా చూశా. పూర్తి వినోదాత్మక చిత్రం. చాలా ఎంజాయ్‌ చేశా.. వెంకీ సర్‌ తన పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు, అది చాలా ఫన్నీగా అనిపించింది.. బ్రిలియంట్‌. వరుణ్‌తేజ్‌ పాత్ర కూడా చాలా సరదాగా ఉంది. వెంకీ సర్‌ టైమింగ్‌కు వరుణ్ సరిగ్గా‌ సరిపోయాడు అని ట్వీట్ చేశారు.