దేశభక్తి పేరుతో భారం మోపుతారా?

2
- Advertisement -

పశ్చిమ ఆసియా సంక్షోభం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఏడు అంశాల విజ్ఞప్తిపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి దేశభక్తిని ఒక ఆయుధంగా వాడుకుంటోందని ఆయన ఆరోపించారు.

అంతర్జాతీయ పరిస్థితుల సాకుతో దేశంలో చమురు ధరలు లేదా ఇతర నిత్యావసరాల ధరలు పెంచి, ఆ భారాన్ని దేశభక్తి పేరుతో సామాన్య పౌరులే భరించాలని కోరడం సరికాదని సంజయ్ సింగ్ విమర్శించారు.ప్రభుత్వం తీసుకునే లోపభూయిష్ట నిర్ణయాలను ఎవరైనా ప్రశ్నిస్తే, వారిని దేశభక్తి లేనివారిగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

పశ్చిమ ఆసియా సంక్షోభం వల్ల తలెత్తే ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవడంలో ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు వేయలేకపోయిందని, ఇప్పుడు ఆ అపరాధభావాన్ని ప్రజలపైకి నెడుతున్నారని ఆయన పేర్కొన్నారు.ప్రజలను త్యాగాలు చేయమని కోరడం కాదు, సంక్షోభ సమయాల్లో వారిని ఆదుకోవడమే ప్రభుత్వ బాధ్యత అని సంజయ్ సింగ్ హితవు పలికారు.

Also Read:BRS:రేపు కేసీఆర్ అధ్యక్షతన సమావేశం

పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న తరుణంలో, దాని ప్రభావం భారత్‌పై పడకుండా ఉండేందుకు ప్రధాని మోదీ దేశ ప్రజలకు మరియు అంతర్జాతీయ సమాజానికి ఏడు విజ్ఞప్తులు చేశారు. దీనిపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

- Advertisement -