టెన్నిస్‌కు సానియా గుడ్‌ బై!

14
- Advertisement -

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్ బై చెప్పారు. మంగళవారం దుబాయ్‌లో జరిగిన డ్యూటీ ఫ్రీ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో తొలి రౌండ్‌లో ఓటమితో తన కెరీర్ కు వీడ్కోలు పలికింది. అమెరికా క్రీడాకారిణి మాడిసన్ కీస్‌తో కలిసి బరిలోకి దిగిన సానియా తొలి రౌండ్లోనే ఓటమి పాలైంది. గంటలోనే ఆట ముగియడం, సానియా ఓడిపోవటంతో అభిమానులు నిరాశ చెందారు.

4-6, 0-6తో వెరోనికా – లుడామిలా (రష్యా) జంట చేతిలో ఓటమి పాలైంది. తొలి సెట్ లో ఒక దశలో 4-4తో చక్కటి ప్రదర్శన కనబర్చిన సానియా జోడీ ఆ తరువాత జోరు కొనసాగించలేక పోయింది. 36ఏళ్ల సానియా మీర్జా తన 20ఏళ్ల కెరీర్లో ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, ఆఫ్రో‌ఆసియా గేమ్స్ ఇలా అన్నింట్లోనూ మెడల్స్ సాధించింది.

1986 నవంబర్ 15న జన్మించిన సానియా మీర్జా.. తన కెరీర్‌లో సానియా ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్, 43 కెరీర్ డబుల్స్ టైటిల్స్ సాధించింది. డబుల్స్ లో మాజీ ప్రపంచ నవంబర్ వన్. ఈ ఘనత సాధించిన తొలి భారత ప్లేయర్ సానియా. డబ్ల్యూటీఏ టైటిల్ గెలిచిన తొలి భారత ప్లేయర్. గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన తొలి భారత క్రీడాకారిణిగా సానియా ఘత సాధించింది. భారత ప్రభుత్వం తరపున అర్జున అవార్డు (2004), పద్మ శ్రీ (2006), ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న (2015), పద్మ భూషణ్ (2016) అందుకుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -