ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె భర్త, పాక్ క్రికెటర్ షోయెబ్ మాలిక్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ శుభవార్త మీ అందిరితో పంచుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు పండంటి మగబిడ్డ పుట్టాడు. నా భార్య కూడా ఆరోగ్యంగా ఉంది. మీ అందరి ప్రేమాభిమానాలకు, ఆశీస్సులకు ధన్యవాదాలు అని తెలిపాడు. అంతేగాదు ‘బేబీ మీర్జా మాలిక్’ అని క్యాప్షన్ ఇచ్చారు.
Excited to announce: Its a boy, and my girl is doing great and keeping strong as usual #Alhumdulilah. Thank you for the wishes and Duas, we are humbled 🙏🏼 #BabyMirzaMalik 👼🏼
— Shoaib Malik 🇵🇰 (@realshoaibmalik) October 30, 2018
పలువురు ప్రముఖులు సానియాకు శుభాకాంక్షలు తెలిపారు. చాలా కాలం తర్వాత ఓ శుభవార్త విన్నాను. కంగ్రాట్స్ సానియా, షోయెబ్ అని ట్వీట్ చేశారు బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ . బిడ్డకు జన్మనిచ్చిన సందర్భంగా మాలిక్ ఆనందానికి అవధుల్లేకుండాపోయానని ఆయన మేనేజర్ మీడియా ద్వారా వెల్లడించారు. 2010లో సానియా, షోయెబ్ల వివాహం జరిగింది.
#BabyMirzaMalik 👼🏼 boy is here! Baby and mother are all smiles, the dad is over the moon 🙏🏼
— Ameem Haq (@agentHAQ) October 30, 2018