“పీహూ” రికార్డు, గిన్నీస్ బుక్‌కు రెండేళ్ల చిన్నారి మూవీ

327
- Advertisement -

జాతీయ అవార్డు గ్రహీత వినోద్ కాప్రి తెరకెక్కిస్తున్న బాలీవుడ్ చిత్రం “పీహూ”. మైరా విశ్వకర్మ అనే రెండేళ్ల చిన్నారి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. రెండేళ్ల చిన్నారి ప్రధాన పాత్రలో నటించిన ఏకైక సినిమాగా రికార్డు సృష్టించిన ఈ చిత్ర ట్రైలర్‌కు విశేషమైన ఆదరణ లభిస్తోంది.


సిద్దార్థ్ రాయ్ కపూర్, శిల్పా జిందాల్, రోన్నీ స్క్రూవాలా “పీహూ” కు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రతీ తల్లిదండ్రులకు వచ్చే పీడకల ఇది.. అనే కాన్సెప్ట్‌తో నిజ జీవిత సంఘటన ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. పీహూ అనే రెండేళ్ల బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఏం చేసింది..? తల్లి చనిపోయిందని తెలియని ఆ పసి పాప.. అమ్మ ఎప్పుడు లేస్తుందా అని ఎదురుచూస్తోంది. చివరకు ఏమైంది అనే సస్పెన్షన్‌తో సినిమా సాగుతోంది.

రూ. 45 లక్షల బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే.. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు అనుహ్య స్పందన లభించడంతో ఈ సినిమాను గిన్నీస్ రికార్డులో చేర్చడానికి కసరత్తు చేస్తున్నారు.

- Advertisement -