రైతు వేదికలు వేగవంతంగా పూర్తి చేయాలి..

115
sandeep kumar sulthania

అక్టోబర్ 24వ తేదీ లోపు రైతు వేదిక నిర్మాణాలు పూర్తి చేసి,దసరా నాడు ప్రారంభం కావాలని,నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తప్పవని పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా ఇన్‌చార్జ్‌ కలెక్టర్ యాస్మిన్ భాషాతో కలిసి వెల్దండ మండలంలోని వెల్దండ, పెద్దాపూర్, కొట్రా, తాడూరు మండల కేంద్రంలోని తాడూరు రైతు వేదికలను ఆయన పరిశీలించారు. రైతు వేదికల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

వెల్దండ రైతు వేదిక నిర్మాణానికి సంబంధించిన సెంట్రింగ్ మెటీరియల్ అందుబాటులోనే ఉందని అబద్ధం చెప్పినందుకు వెల్దండ ఎంపీడీవో వెంకటేశ్వరరావును సస్పెండ్ చేయాలని కలెక్టర్‌ను ముఖ్య కార్యదర్శి ఆదేశించారు. నిర్మాణ పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి అయ్యేలా ఇంజనీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పనుల్లో పురోగతి లేని చేత సంబంధిత డిఈ, ఏఈలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనంతరం జిల్లాలో నిర్మిస్తున్న 143 రైతు వేదిక భవన నిర్మాణాల పురోగతిపై సంబంధిత అధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లతో జిల్లాకేంద్రంలో సందీప్‌ కుమార్‌ సుల్తానియా సమీక్షించారు. 143 రైతు వేదికల నిర్మాణాల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వీక్షించి సమీక్షించారు.