కాంగ్రెస్,బీజేపీలతో ఒరిగేదేమీ లేదు- మంత్రి హరీష్‌

156
harish rao

సిద్ధిపేట జిల్లా మిడిదొడ్డి మండలం అందే గ్రామంలో మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, జెడ్సీ ఛైర్మెన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ పాల్గొన్నారు. అందెలో మంత్రి హరీష్ రావు,అభ్యర్థి సోలిపేట సుజాతకు నేతలకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ మాట్లాడుతూ.. బీజేపీ నేతలవి మాటలెక్కువ ,చేతలు తక్కువ అని ఎద్దేవ చేశారు. కాంగ్రెస్ పార్టీ కరెంటు ఇవ్వక రైతులను చంపితే…బీజేపీ పార్టీ వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టి రైతులను చంపాలని చూస్తున్నది. అందుకే పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టింది అన్నారు మంత్రి.

ఆంధ్రాలోని శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే కరెంటు మోటర్లకు మీటర్లు పెట్టడం మొదలయ్యింది. కరెంటు మోటర్లకు మీటర్లు పెట్టేది లేదని సీఎం కేసీఆర్ తెగేసి చెప్పిండు. అంతేకాదు ప్రధాన మంత్రికి లెటర్ కూడా రాసిండు అని హరీష్‌ తెలిపారు. మరి మీటర్లు పెడతామంటున్న,బీజేపీకి ఓటేస్తార.. ఉచిత కరెంటు ఇస్తున్న టీఆర్‌ఎస్‌కు ఓటేస్తారా.. దుబ్బాక ప్రజలు నిర్ణయించుకివాలి అన్నారు. కాంగ్రెస్,బీజేపీలతో ఒరిగేదేమీ లేదు. రైతుల మేలు కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త రెవిన్యూ చట్టం తీసుకు వచ్చాడు. రెవిన్యూలో ఇక మీద అవినీతి ఉండదు. ప్రతి అంగుళం భూమిని సర్వే చేసి రైతులకు వారి పేరున పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. అసైన్‌డ్‌ భూములను కూడా రెగ్యులరైజ్ చేసేందుకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని మంత్రి స్పష్టం చేశారు.

దుబ్బాక చరిత్రలో మొదటి సారి ఒక మహిళ ఎమ్మెల్యే కాబోతున్నాది. సుజాతక్కకు మాహిళలంతా అండగానిలవాలి. భర్తను కోల్పోయిన సోలిపేట సుజాతక్కకు టీఆర్‌ఎస్‌ పార్టీ అండగా నిలిచింది. కేసీఆర్‌ ఒక తండ్రిలా రామలింగారెడ్డి కుటుంబాన్ని ఆదుకుంటామని అండగా నిలిచారు. సుజాతక్కకు అండగా ఉంటామంటే కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి సంస్కార హీనంగా మాట్లాడుతున్నాడు. మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలకు దుబ్బాక మహిళలు బుద్ధి చెప్పాలి. ఎన్నికల తర్వాత అందే గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి హరీష్‌ హామీ ఇచ్చారు.