సనాతన ధర్మం అంటే ఇదేనా..మోడీజీ!

34
- Advertisement -

ఆ మధ్య సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని తమిళనాడు మంత్రి ఉదయనిది స్టాలిన్ పై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడిన సంగతి తెలిసిందే. హిందూ ధర్మాన్ని అవమానించారని, భారతీయుల సనాతన ధర్మంపై అలా మాట్లాడడం సరికాదని కమలనాథులు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కొంతమంది బాబా ముసుగులో ఉన్నవాళ్ళు స్టాలిన్ తల నరికితే బహుమానం కూడా ఇస్తామని ప్రకటించారు. ఇలా ఒక మనిషిని నరుకుతామని చెప్పడం సనాతన ధర్మమా అంటూ అప్పుడే బీజేపీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇక తాజాగా పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా చోటు చేసుకున్నా కొన్ని పరిణామాలు సనాతన ధర్మంపై మరోసారి రగడ రాజుకునేలా కనిపిస్తోంది..

నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి బాలీవుడ్ హీరోయిన్స్ ను పిలిపించిన బీజేపీ ప్రభుత్వం.. మన రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము ను ఎందుకు పిలవలేదని ప్రశ్నలు వ్యక్తమౌతున్నాయి. ద్రౌపది ముర్ము ఒక గిరిజన మహిళా కావడం, ఇంకా వితంతువు కావడం వల్ల మోడి సర్కార్ ఆమెకు ఆహ్వానం ఇవ్వలేదని విమర్శలు వ్యక్తమౌతున్నాయి. దేశ అత్యున్నత పదవిలో ఉన్న మహిళా కు గౌరవం ఇవ్వలేని వాళ్ళు సనాతన ధర్మం గురించి నీతులు చెబుతున్నారని బీజేపీ నేతలపై సామాన్యులు కూడా మండి పడుతున్నారు. ఇవన్నీ కూడా మతం ముసుగులో స్వార్థ రాజకీయాలే తప్పా ఇంకోటి కాదని మోడి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. పైకేమో మతలపై బడుగు బలహీన వర్గాలపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు మోడీ ప్రవర్తిస్తున్నప్పటికి లో లోపల మాత్రం మతవిద్వేషాలకు కేరాఫ్ అడ్రెస్ గా మోడీ ఆలోచనలు ఉంటాయని రాజకీయ అతివాదులు చెబుతున్నా మాట.

Also Read:ఆమె స‌మంతను మారుస్తానంటుంది

- Advertisement -