శామ్‌సంగ్‌ జే6,జే8కి విశేష స్పందన

292
samsung j6
- Advertisement -

దక్షిణకొరియాకు చెందిన అండ్రాయిడ్ మొబైల్ దిగ్గజం శామ్‌సంగ్ ఇటీవలె రెండు సరికొత్త స్మార్ట్ ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. గెలాక్సీ జే6,గెలాక్సీ జే8లకు దేశీయ కస్టమర్ల నుంచి విశేష ఆదరణ లభించింది. కేవలం రెండు నెలల్లోనే 20 లక్షలకు పైగా ఫోన్లను విక్రయించినట్లు శామ్‌సంగ్ సంస్థ వెల్లడించింది.

భారత మార్కెట్లో అమ్ముడయ్యే ప్రతి మూడు స్మార్ట్ ఫోన్లలో గెలాక్సీ జే ఫోన్‌ ఉందని తెలిపారు. రాబోయో రోజుల్లో మరిన్ని సరికొత్త స్మార్ట్ ఫోన్లతో ముందుకువస్తామని…కస్టమర్లకు అనుగుణంగా మా ఉత్పత్తులు తీసుకురావడమే మా విజయానికి కారణమన్నారు.

గెలాక్సీ జే6 ఫీచర్స్..

()5.6 అంగుళాల హెచ్‌డీ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే,
() 3జీబీ/32 జీబీ, 4జీబీ/64జీబీ వేరియంట్లు
() ఆండ్రాయిడ్ ఓరియో 8.0 ఓఎస్
() 13 మెగాపిక్సల్ రియర్, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
() 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

గెలాక్సీ జె8 ఫీచర్లు

()6 అంగుళాల హెచ్‌డీ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే
() 4జీబీ ర్యామ్
()64జీబీ ఆన్‌బోర్డ్ మెమొరీ, 256 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు
()16+5 మెగాపిక్సెల్‌ ప్రధాన కెమెరా, 16 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరా
() ఆండ్రాయిడ్‌ ఓరియో 8.0 ఓఎస్
() 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం

- Advertisement -