నా పెళ్లి…నా ఇష్టం…మీకెందుకు..?

219
Niveda Thomas
- Advertisement -

జెంటిల్మెన్, నిన్నుకోరి చిత్రాల్లో కథానాయికగా నటించి తన అందంతోనే కాక అభినయంతోనూ ఆకట్టుకుని తెలుగు ప్రేక్షకులకు చేరువైన మలయాళ బ్యూటీ నివేదా థామస్‌. తర్వాత ఎన్టీఆర్‌ జై లవకుశతో ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది. అయితే తర్వాత వచ్చిన జూలియట్‌ లవర్‌ ఆఫ్‌ ఇడియట్‌ మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో కొద్దికాలం విరామం తీసుకుంది ఈ బ్యూటీ బ్యూటీ.

దీంతో ఈ బ్యూటీపై గాసిప్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. త్వరలో నివేదా పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వెలువడగా వాటిని ఖండించింది ఈ కేరళ బ్యూటీ. సరైన సమయం వచ్చినప్పుడే పెళ్లి చేసుకుంటానని కానీ తర్వాత మాత్రం యాక్టింగ్ కొనసాగిస్తా అని చెప్పింది.

సినిమా ఇండస్ట్రీని వదిలిపెట్టే ప్రసక్తే లేదని…నటన తన వృత్తి అని స్పష్టం చేసింది. పెళ్లి అయ్యాక నటనకు సంబంధించి అన్ని నిర్ణయాలు తానే తీసుకుంటానని చెప్పింది. ప్రస్తుతం కేవీ గుహన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీలో నటిస్తోంది నివేదా. కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో షాలిని పాండే మరో హీరోయిన్‌గా నటిస్తోంది.

- Advertisement -