కరోనా వైరస్ కథాంశంతో సంపూ మూవీ!

113
sampoornesh babu

హృదయకాలేయం చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన నటుడు సంపూర్ణేష్ బాబు.టాలీవుడ్‌లో కామెడీ పేరడి చిత్రాలకు కేరాఫ్‌గా మారిన సంపూ తాజాగా మరో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకురానున్నాడు.

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ కథాంశంతో సినిమా చేయనున్నాడట సంపూ. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుండ‌గా, త్వ‌ర‌లోనే దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంది. అయితే ఈ చిత్రాన్ని సంపూ స్పూఫ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా చేస్తారా లేదంటే సీరియ‌స్ డ్రామాగా చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.

ఇప్పటికే కరోనా వైరస్ కథాంశంతో ఆర్జీవీ సినిమా తెరకెక్కించగా జాంబీరెడ్డి టైటిల్‌తో ప్రశాంత్ వర్మ మరో సినిమా తెరకెక్కిస్తున్నారు.