బావ త్వరగా కోలుకోవాలి: కేటీఆర్

94
ktr

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. రాష్ట్రంలో ఇప్పటివరకు పలువురు ప్రజాప్రతినిధులకు కరోనా పాజిటివ్ రాగా తాజాగా మంత్రి హరీష్ రావుకు కరోనా పాజిటివ్‌గా తేలింది. కరోనా లక్షణాలతో పరీక్షలు చేయించుకున్నానని పాజిటివ్‌గా వచ్చిందని తెలిపారు. తనను కలిసిన వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని..ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు.

హ‌రీష్‌రావుకు క‌రోనా సోక‌డంపై ఐటీ మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. గెట్ వెల్ సూన్ బావ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇత‌రుల కంటే మీరు త్వ‌ర‌గా కోలుకుంటార‌నే న‌మ్మ‌కం ఉంద‌ని కేటీఆర్ అన్నారు.