సంపూ అలియాస్ సంపూర్ణేష్ బాబు ‘హృదయకాలేయం’సినిమాతో టాలీవుడ్‌కు ఉవ్వెత్తున దూసుకొచ్చాడు. బర్నింగ్ స్టార్‌గా పాపులర్ అయిన సంపూ..తన తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిద్రపోయాడు. అంతేకాకుండా వరుస ఆఫర్లతో దూసుకుపోతూ.. మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, దర్శకదిగ్గజం రాజమౌళి వంటి గొప్ప వాళ్లతోనే ప్రశంలందుకున్నాడు సంపూ.
ఇక ఈసారి `కొబ్బరి మట్ట` అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కాగా నేడు సంపూ పుట్టిన రోజు కావడంతో తాజా చిత్రం `కొబ్బరి మట్ట`పై ఆసక్తికర విశేషాలు చెప్పుకొచ్చాడు సంపూ. ప్రస్తుతం ఆయన రూపక్ రోనాల్డ్ సన్ దర్శకత్వంలో ‘కొబ్బరిమట్ట’ అనే సినిమాని చేస్తున్నాడు.
ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో మంచి స్పందన తెచ్చుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకానుంది. ఈరోజు మంగళవారం తన పుట్టిన రోజు కావడంతో సంపూర్ణేష్ బాబు నిన్న మీడియాతో ‘కొబ్బరిమట్ట’ చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. సంపూ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నేను పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయిడు అనే మూడు పాత్రల్లో కనిపిస్తాను.
ఏడుగురు భార్యలు, పన్నెండు మంది పిల్లలు, 40 మంది మనవలు, మానవరాళ్లతో నిండిన ఒక పెద్ద కుటుంబ కథా చిత్రమిది. నా స్టైల్లో కామెడీ ఉంటుంది. సినిమా బాగా వచ్చింది. నా తొలి సినిమా `హృదయ కాలేయం` సినిమా నచ్చిన వాళ్లందరికీ ఈ సినిమా కూడా నచ్చుతుంది. కేక పెట్టించడం ఖాయం.
అలాగే ఫ్యామిలీ ఆడియన్సుకు తప్పక నచ్చుతుంది. హృదయకాలేయం చిత్రంలో కన్నా ఇందులో 100 రెట్లు ఎక్కువ వినోదం దొరుకుతుంది’ అన్నారు. అలాగే రాబోయే ఆగష్టులో మరో రెండు కొత్త సినిమాల్ని అనౌన్స్ చేస్తానని కూడా చెప్పారు సంపూ. మొత్తానికి ఈ బర్నింగ్‌స్టార్ తన బర్త్డేరోజున ప్రేక్షకులకు గిఫ్ట్‌గా..కేకపెట్టించే సినిమా వచ్చేస్తోందని చెప్పేశాడు.