సంపూ…మరో సంచలనం..!

553
sampoornesh babu
- Advertisement -

హృదయకాలేయం సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్‌ సృష్టించిన హీరో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌ బాబు. తాజగా కొబ్బరిమట్టతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంపూ బాక్సాఫీస్‌ని షేక్ చేశాడు. మూడు రోజుల్లో మంచి వసూళ్లను రాబట్టి తన పవర్ చూపించాడు.

ఇక ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో విజయయాత్ర చేస్తున్న సంపూ టీంకు తిరుపతిలో ఘనస్వాగతం లభించింది. సంపూ బ్యానర్లు కట్టి మరి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు ఫ్యాన్స్‌.

ఈ సందర్భంగా మాట్లాడిన సంపూ తన నెక్ట్స్ ప్రాజెక్టు గురించిన డిటైల్స్ వెల్లడించారు. తాను త్వరలోనే మరో చిత్రానికి మయ్యానని ….కొబ్బరిమట్ట చిత్రాన్ని తెరకెక్కించిన దర్శక నిర్మాతలే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు.

కాగా కొబ్బరిమట్ట చిత్రానికి రూపక్ రోనాల్డ్ సన్ దర్శకత్వం వహించగా సాయి రాజేష్ నీలమ్ నిర్మించారు. షకీలా, కత్తి మహేష్, ఇషికా సింగ్ ఇతర కీలకపాత్రలు పోషించారు.

- Advertisement -