టీఎన్‌ఆర్ కుటుంబానికి అండగా సంపూ..

203
sampoo
- Advertisement -

కరోనాతో మృతిచెందిన ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్‌, న‌టుడు తుమ్మల నరసింహ రెడ్డి( టీఎన్ఆర్) కుటుంబానికి అండగా నిలిచేందుకు సినీ రంగానికి చెందిన ప్రముఖులు ముందుకొస్తున్నారు. తాజాగా బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు,దర్శకుడు మారుతి తమవంతు సాయాన్ని అందించారు. సంపూ..టీఎన్‌ఆర్ కుటుంబానికి 50 వేల రూపాయలు ఆర్థికసాయం చేయగా దర్శకుడు మారుతి సైతం 50 వేల రూపాయ‌ల సాయాన్ని అందించారు.

టీఎన్ఆర్ భార్య జ్యోతి బ్యాంక్ అకౌంట్‌కు మ‌నీ పంపిన మారుతి.. ప్ర‌తి ఒక్క‌రు త‌మకు తోచినంత సాయం వారికి చేయాలని సూచించారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు తమవంతు సాయాన్ని అందించిన సంగతి తెలిసిందే.

- Advertisement -