గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న నటి హేమల్..

134
Actress Hemal
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సినీ నటి హేమల్ మొక్కలు నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆలోచనకు శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని హేమల్‌ తెలిపారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. సినీ హీరో రాజ్ తరుణ్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ సినీ నటి హేమల్ గచ్చిబౌలిలో మొక్కలు నాటారు. అనంతరం మరో ఇద్దరు( ఫ్యాషన్ డిజైనర్ మేఘన, డిఒపి సంజోసాఫ్ )లు కూడా గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ మొక్కలు నాటాలని సినీ నటి హేమల్ పిలుపునిచ్చారు.

- Advertisement -