ఏఐసీసీ కార్యదర్శిగా సంపత్ తొలగింపు

3
- Advertisement -

కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఏఐసీసీ కార్యదర్శుల నియామకాల్లో భాగంగా పార్టీ అధిష్ఠానం 81 మందితో కొత్త జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో పలువురు పాత నేతలకు ఉద్వాసన పలుకుతూ, కొత్తవారికి అవకాశం కల్పించింది. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలు సంపత్ కుమార్, బీఎం సందీప్‌లను ఏఐసీసీ కార్యదర్శుల బాధ్యతల నుంచి తొలగించింది.

ముఖ్యంగా కాంగ్రెస్ నేత సంపత్ కుమార్‌పై వచ్చిన ఆరోపణలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఇసుక మాఫియాతో సంబంధాలు, కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు తీసుకోవడం వంటి అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలోనే ఆయనను పదవి నుంచి తప్పించినట్లు ప్రచారం జరుగుతోంది.

మరోవైపు మీనాక్షి నటరాజన్ స్థానంలో ఇటీవల ఏఐసీసీ కార్యదర్శిగా నియమితులైన బీఎం సందీప్‌ను సైతం అధిష్ఠానం తొలగించింది. తాజా నియామకాలతో ఆయనకు కూడా పదవిలో కొనసాగేందుకు అవకాశం లేకుండా పోయింది.

ఇక తెలంగాణ నుంచి అజ్మత్ హుస్సేన్, కోలుకొండ సతీష్‌లకు ఏఐసీసీ కార్యదర్శులుగా అవకాశం కల్పిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఒడిశా కార్యదర్శిగా కొనసాగుతున్న జెట్టి కుసుమ్ కుమార్‌ను అదే బాధ్యతల్లో కొనసాగించాలని నిర్ణయించింది.

Also Read:రాజీనామా చేస్తే..తప్పు చేసినట్లు కాదు!

మొత్తం 81 మందితో కొత్త కార్యదర్శుల జాబితాను ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్.. పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో మార్పులు చేపట్టింది.

- Advertisement -