రివ్యూ: సమ్మతమే

252
sammathame review
- Advertisement -

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ “సమ్మతమే”. చాందిని చౌదరి కథానాయికగా నటిస్తోండ‌గా యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కంకణాల ప్రవీణ నిర్మించిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకువ‌చ్చింది. ఈ సినిమాతో కిర‌ణ్ అబ్బ‌వ‌రం ఆక‌ట్టుకున్నాడా లేదా చూద్దాం…

కథ:
చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో ఇంట్లో ఆడవాళ్లు లేని లోటును తీర్చగలిగే జీవిత భాగస్వామి కోసం ఎదురుచూస్తుంటాడు కృష్ణ (కిరణ్ అబ్బవరం). అయితే పెళ్లికి ముందు ప్రేమ అంటే ఇష్టం ఉండ‌ని కృష్ణ‌…రాబోయే లైఫ్‌ పార్టనర్‌‌ కూడా తనలాగే ఉండాలనుకుంటాడు. ఆ కారణంతోనే శాన్వి (చాందిని చౌదరి)పై ఇష్టం ఉన్నా పెళ్లి చూపుల్లో రిజెక్ట్ చేస్తాడు. ఆ తర్వాత శాన్విపై తనకున్నది ఇష్టం కాదు, ప్రేమ అని తెలుసుకుని ఆమెకు ద‌గ్గ‌ర‌య్యేందుకు ప్ర‌య‌త్నిస్తాడు. ఈ క్ర‌మంలో కృష్ణ చేసిన ప్ర‌య‌త్నాలు స‌త్ఫ‌లితాల‌నిచ్చాయా..? చివ‌రికి క‌థ ఎలా సుఖాంతం అయింద‌నేదే స‌మ్మ‌త‌మే క‌థ‌.

ప్ల‌స్ పాయింట్స్‌:
సినిమాలో మేజ‌ర్ ప్ల‌స్ పాయింట్స్ క‌థ, కామెడీ, ఫ్యామిలీ ఎమోష‌న్స్‌. కృష్ణ పాత్ర‌లో ఒదిగిపోయారు కిర‌ణ్. తన ఆలోచనలకు, వాస్తవాలకు మధ్య సంఘర్షణ పడే యువకుడిగా తన నటన ఆకట్టుకుంది. మోడర్న్ అమ్మాయి క్యారెక్టర్‌‌కి చాందిని న్యాయం చేసింది. మిగిలిన పాత్ర‌లో గోపరాజు రమణ, హీరోయిన్ కుటుంబ సభ్యులుగా శివన్నారాయణ, అన్నపూర్ణమ్మ పాత్రల పరిధి మేరకు మెప్పించారు.

మైన‌స్ పాయింట్స్:
సినిమాలో మేజ‌ర్ మైన‌స్ పాయింట్స్ సెకండాఫ్, క‌థ‌కు త‌గ్గ సీన్స్‌ రాసుకోవడంలో కొంత తడబడ్డాడు ద‌ర్శ‌కుడు. కొన్ని సీన్స్‌పై మ‌రింత దృష్టి సారిస్తే బాగుండేది.

సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమా బాగుంది. ప్రేమకథలకు కథనంతో పాటు చక్కని సంగీతం తోడయితేనే మెప్పించగలుగుతాయి. మ్యూజిక్ విషయంలో సినిమాకి ప్రధాన బలంగా నిలిచాడు శేఖర్‌‌ చంద్ర. సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా సాగే ఏడు మెలోడియస్‌ ట్యూన్స్ తో పాటు నేపథ్య సంగీతంతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. ఎక్కడా బోర్‌‌ కొట్టించకుండా సాఫీగా నడిపించడం, చక్కని నేపథ్య సంగీతం కాస్త కలిసొచ్చాయి. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

తీర్పు:
ప్రేమ అంటే ఒకరి ఇష్టాయిష్టాల్ని మరొకరు గౌరవించడమే తప్ప మన ఇష్టాల కోసం మరొకరి ఇష్టాలను చంపేయడం కాదు అనే పాయింట్‌తో తెర‌కెక్కిన చిత్రం స‌మ్మ‌త‌మే. క‌థ‌, కామెడీ సినిమాకు ప్ల‌స్ కాగా సెకండాఫ్‌పై కాస్త దృష్టి సారిస్తే బాగుండేది. ఓవ‌రాల్‌గా ఈ వీకెండ్‌లో ప‌ర్వాలేద‌నిపించే మూవీ స‌మ్మ‌త‌మే.

విడుద‌ల తేదీ:24\06\2022
రేటింగ్‌:2.25\5
నటీనటులు: కిరణ్‌ అబ్బవరం, చాందినీ చౌదరి, తదితరులు
సంగీతం: శేఖర్ చంద్ర
నిర్మాత: కంకణాల ప్రవీణ
దర్శకత్వం: గోపినాథ్ రెడ్డి

- Advertisement -