ప్చ్.. హీరో బంగారు కెరీర్ పాయె

22
- Advertisement -

కిరణ్ అబ్బవరం.. ఓ సామాన్యుడు. సడెన్ గా హీరో అయిపోయాడు. పైగా తక్కువ సమయంలోనే రెండు మూడు హిట్లు పడ్డాయి. ఇంకేం ఉంది ?, మినిమిమ్ గ్యారెంటీ హీరోగా మనోడు నిలబడిపోయాడు అనుకున్నారు అతని సన్నిహితులు. ఈ క్రమంలోనే కిరణ్ అబ్బవరం హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా కొత్త దర్శకుడు రథినం కృష్ణ తెరకెక్కించిన చిత్రం “రూల్స్ రంజన్”. సినిమా టైటిల్ లో కొత్తదనం ఉంది కాబట్టి, సినిమాలో కూడా ఉంటుందేమో అని ప్రేక్షుకులు ఆశ పడ్డారు. ఆ ఆశ నిరాశే అయ్యింది. ముఖ్యంగా హీరోగా కిరణ్ అబ్బవరం తేలిపోయాడు. కథ చెప్పడంలో దమ్ము లేదోయ్ కిరాణా ?, కథ లేకపోతే నువ్వు ఎన్ని వేషాలు వేస్తేనేం ? అని ప్రేక్షుకులు థియేటర్స్ లో అరుస్తున్నారు అంటే.. కారణం కచ్చితంగా కిరణ్ అబ్బవరమే.

ఒక తెలుగు హీరోగా చలామణి కావాలంటే.. బలమైన సినీ కుటుంబ నేపథ్యం ఉండాలి. బోలెడు సినిమాలు చేయాలి. పైగా చేసిన సినిమాల్లో.. నా సినిమా ఇది అని చెప్పుకునేందుకు ఒక్క గొప్ప హిట్ ఉండాలి. అప్పుడే హీరోగా గ్రాఫ్ ఉంటుంది. కిరణ్ అబ్బవరంకి ఇవేమీ లేకుండానే గ్రాఫ్ వచ్చింది. మరి కిరణ్ అబ్బవరం ఏమి చేశాడు ?, కావాలని సోకాల్డ్ మాస్ హీరో ప్రొజెక్షన్ కోసం తాపత్రయపడ్డాడు. భిన్నమైన పాత్రల్ని ఎంపిక చేసుకోకుండా రెగ్యులర్ మాస్ హీరో అయిపోవాలని ఉత్సాహ పడ్డాడు. దాని కోసం నటనను పక్కన పెట్టేసి.. ఫిజిక్ మెయింటెయిన్ చేయడం ఫోకస్ పెట్టాడు.

Also Read:ఏక్షణంలోనైనా జంప్.. బీజేపీలో కలవరం!

తన పాత్రకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేయకుండా.. ఫైట్లు చేయడానికి ఎక్కువ ఇష్టపడ్డాడు. అబ్బవరం పాత్రల ఎంపిక బాగానే ఉంటుంది… కానీ ఎక్కడో ఉంది నెగటివ్ సుడి… ఈ మధ్య ఒక్కటీ క్లిక్ కావడం లేదు… ఇప్పుడు ఏకంగా రొటీన్ పాత్రతో రూల్స్ రంజన్ అనే సినిమా చేశాడు… గెటప్పులు సెటప్ లు సంగతి పక్కన పెడితే.. మళ్లీ దురదృష్టమే కిరణ్ అబ్బవరంకు మిగిలింది. ఆ రేంజ్ లో రూల్స్ రంజన్ విసిగించాడు. కథ కూడా గందరగోళం… ఏ పాత్ర ఏమిటో మనకు అర్థమయ్యే సమయానికి శుభం కార్డు పడుతుంది. అది కిరణ్ అబ్బవరం సినిమా పరిస్థితి. వచ్చిన బంగారు అవకాశాన్ని కిరణ్ అబ్బవరం పాడు చేసుకోవడం బాధాకరమైన విషయమే.

Also Read:KTR:త్వరలో మళ్లీ పెన్షన్ పెంపు

- Advertisement -