సీఎం కేసీఆర్‌ మార్గనిర్దేశంతో రాష్ట్రం ప్రగతిపథంలో నడుస్తుంది..

220
minister koppula eshwar
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలు,పక్కా ప్రణాళికతో గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని,మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం రాంనూర్, శాఖాపూర్,ముద్దునూరులలోసోమవారం ఆయన పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కేసీఆర్ మార్గనిర్దేశంతో పల్లెప్రగతి పథకం ద్వారా గ్రామాలలో ప్రజలకు అవసరమయ్యే మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. పల్లెల్లో నర్సరీలు ఏర్పాటు చేసుకుని పెద్ద ఎత్తున మొక్కల్ని నాటుతూ వనాలు కూడా పెంచుతున్నామన్నారు.

పారిశుద్ధ్యం పనులు ప్రతినిత్యం కొనసాగుతుండడంతో పరిసరాలు పరిశుభ్రంగా కనబడుతున్నాయని చెప్పారు.పల్లెప్రగతి కార్యాచరణలో భాగంగా అంతర్గత రోడ్లు,వైకుంఠధామాల నిర్మాణం,రోడ్లకు ఇరువైపులా పిచ్చిమొక్కల తొలగింపు పనులు కొనసాగుతున్నాయని మంత్రి వివరించారు.నీళ్లకు, విద్యుత్ సరఫరాలు పూర్తిగా అందుబాటులోకి రావడంతో పంటలు బాగా పండాయని, అభివృద్ధి పనులు కూడా వేగవంతంగా కొనసాగుతుండడంతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని,పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొన్నదన్నారు.కార్యక్రమంలో పెద్దపల్లి లోకసభ సభ్యులు వెంకటేష్ నేత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -