సమంత ‘యూటర్న్’ ట్రైలర్‌

280
- Advertisement -

టాలీవుడ్‌ బ్యూటీ సమంత ఈ ఏడాది ప్రథమార్ధంలో వరుస విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సమంత ద్వితీయార్దంలోను ఆ హవా కొనసాగించబోతుంది. సమంత ప్రధాన పాత్రగా థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘యూటర్న్’. ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి పవన్ కుమార్ దర్శకుడిగా వ్యవహరించాడు. కన్నడలో ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు ఈయనే. అక్కడ హిట్ కావడం వలన ఈ సినిమా తెలుగులో కూడా రీమేక్ చేస్తున్నారు.

Samantha

ఈ చిత్ర ట్రైలర్‌ని ఈ రోజు విడుదల చేశారు. ఇందులో సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక ఈ మూవీలో సమంత తన పాత్రకి ఓన్ డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం ఫై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి పూర్ణ చంద్ర తేజస్వి సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళ భాషలలో విడుదల కానున్న యూటర్న్ చిత్రం ప్రేక్షకులని తప్పక మెప్పిస్తుందని చెబుతున్నారు. సెప్టెంబర్ 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

- Advertisement -