వాజ్‌పేయి అంత్యక్రియలు పూర్తి..

219
Atal Bihari Vajpayee

భారత రాజకీయాల్లో ఒక గొప్ప ప్రజాస్వామ్యవాది శకం ముగిసిపోయింది. తొలితరం జాతీయ నాయకుల్లో ఒకరైన గొప్ప రాజనీతిజ్ఞుడిని జాతి కోల్పోయింది. అత్యుత్తమ పార్లమెంటేరియన్, మానవతావాది, జాతీయవాది, భారతరత్న పురస్కార గ్రహీత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి (93) మహాభినిష్క్రమణం చెందారు. ఢిల్లీలోని రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో వాజ్ పేయి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. మంచి గంధపు చెక్కల చితిపై వాజ్ పేయి పార్ధివ దేహానికి దత్త పుత్రిక నమిత భట్టాచార్య నిప్పంటించారు. హిందూ సంప్రదాయం ప్రకారం వేద పండితులు వాజ్ పేయి అంత్యక్రియలు నిర్వహించారు.

Atal Bihari Vajpayee

కాగా, బీజేపీ అగ్రనేతలు, అభిమానులు, ఆయన కుటుంబసభ్యులు వాజ్ పేయికి కన్నీటీ వీడ్కోలు పలికారు. వాజ్ పేయి అంతక్రియల్లో రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, బీజేపీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా భూటాన్ రాజు, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రులు, అఫ్ఘనిస్థాన్ మాజీ ప్రెసిడెంట్ కర్జాయ్, పాకిస్థాన్ న్యాయశాఖ మంత్రి వాజ్‌పేయి అంత్యక్రియలకు హాజరయ్యారు.