24న నాగశౌర్య ‘@నర్తనశాల’ ప్రీ రిలీజ్..

190

యంగ్ హీరో నాగశౌర్య వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం నాగశౌర్య కథానాయకుడిగా శ్రీనివాస చక్రవర్తి దర్శకత్వంలో ‘నర్తనశాల’ సినిమా రూపొందింది. ఈ చిత్రినానికి నాగశౌర్యనే నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. తన సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు నాగశైర్య.

@Narthanasala Movie Pre Release

ఈ చిత్రంలో నాగ శౌర్యకు జోడీగా కాష్మీర,యామినీ భాస్కర్ కథనాయికలుగా నటించారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈనెల 24వ తేదీన ఘనంగా జరపడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. ఈ నెల 30వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

అయితే ‘నర్తనశాల’ విడుదలైన నెక్ట్స్‌ డే నే నాగచైతన్య ‘శైలజా రెడ్డి అల్లుడు’ విడుదల వుంది. మారుతి సినిమా కావడం వలన .. కీలకమైన రోల్ ను రమ్యకృష్ణ చేయడం వలన ఈ మూవీపై భారీస్థాయిలో అంచనాలు వున్నాయి. అయినా ఎంతమాత్రం అధైర్య పడకుండగా ‘నర్తనశాల’ రంగంలోకి దిగుతుండటం విశేషమేనని చెప్పాలి. ఈ మూవీకి మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు.