“మహాసముద్రం”లో సమంత

562
Samantha Ajay Bhupathi

ఆర్ఎక్స్ 100 మంచి విజయం సాధించిన దర్శకుడు అజయ్ భూపతి ఇప్పటి వరకు తన తర్వాతి సినిమాను ప్రారంభించలేదు. స్క్రీప్ట్ రెడీగా ఉన్నా హిరోలు ముందుకు రావడం లేదు. తన తర్వాతి మూవీగా మహాసముద్రం అనే టైటిల్ ను ఖరారు చేశాడు దర్శకుడు అజయ్ భూపతి. అయితే ఈసినిమాలో మొదట రవితేజ నటిస్తాడని అనుకున్నారు. కొన్ని కారణాల వల్ల రవితేజ ఈసినిమాను వదిలేసుకున్నాడు. అయితే ఈ తర్వాత ఇదే కథను నాగచైతన్యకు వినిపించాడు దర్శకుడు అజయ్ భూపతి.

చైతూ ప్రస్తుతం రెండు సినిమాల్లో బిజీగా ఉండటంతో ఇప్పుడు అదే కథను శర్వానంద్ ను వినిపించాడు. శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే ఈమూవీని ప్రారంభించనున్నారు. అయితే శర్వానంద్ సరసన ఈమూవీలో సమంత నటించనుందని తెలుస్తుంది. కాగా సమంత ప్రస్తుతం శర్వానంద్ సరసన 96మూవీలో నటిస్తుంది. ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఫిబ్రవరి 14న 96మూవీని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు చిత్రయూనిట్.