సమంత బ్యాచిలర్స్ పార్టీ అదుర్స్

230
Samantha Throws A Cozy Bachelorette Party
- Advertisement -

మరో రెండు వారాల్లో సమంత అక్కినేని వారి ఇంట్లో కోడలిగా అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 6వ తేదీ ఆ శుభకార్యానికి శుభ ముహూర్తంగా ఫిక్స్ అయింది. ఈ నేపథ్యంలోనే బ్యాచిలర్ లైఫ్‌లో తన చివరి రోజులని సెలబ్రేట్ చేసుకుంటోంది సమంత. ఆ సెలబ్రేషన్స్‌లో భాగంగానే సినీ పరిశ్రమలోనేకాకుండా తన పర్సనల్ క్లోజ్ ఫ్రెండ్స్ కొంతమందికి తాజాగా బ్యాచిలర్ పార్టీ ఇచ్చింది సమంత.

ఈ పార్టీకి నాగచైతన్య, నాగార్జున, అఖిల్, సుశాంత్, అమల వంటి అక్కినేని ఫ్యామిలీకి చెందిన స్టార్స్‌తోపాటు రామ్ చరణ్, ఉపాసన దంపతులు కూడా ఈ బ్యాచిలర్ పార్టీకి హాజరై ఎంతో సంతోషంగా కెమెరాలకి ఫోజిచ్చారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

అందులో సమంత ఎంత సెక్సీగా ఉందో.. నాగ చైతన్య అంత హాటుగా ఉన్నాడు. అంతే కాకుండా పార్టీకి విచ్చేసిన శిల్పా రెడ్డి వంటి ఆత్మీయులు కూడా పిచ్చ హాటుగా ఉన్నారంతే.వచ్చే నెల గోవాలో వీరి పెళ్లి ఇరు సంప్రదాయాల ప్రకారం రెండు సార్లు జరగబోతోంది. ఇప్పటికే పెళ్లి కోసం ఇరు కుటుంబాలు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాయి. అక్టోబర్ 6న హిందు సంప్రదాయం ప్రకారం – అక్టోబర్ 7న క్రిస్టియన్ పద్ధతుల్లో సమంత -నాగ చైతన్య ఒక్కటి కాబోతున్నారు. ఇక ఈ పెళ్లికి నాగ్ ఆత్మీయులు మాత్రమే వస్తున్నారని టాక్. ఇక సమంత కెరీర్ విషయానికొస్తే, రామ్‌చరణ్‌తో నటిస్తున్న రంగస్థలం సహా దాదాపు అర డజన్ చిత్రాలు ఆమె చేతిలో వున్నాయి. అందుకే పెళ్లయిన వెంటనే మళ్లీ సినిమా షూటింగ్స్‌తో బిజీ కానున్నట్టు సమంత గతంలోనే చెప్పేసింది.

- Advertisement -