కొడుకు కోసం కొత్త హీరోయిన్‌..!

267
Neha Shetty in Puri Jagannadhi's film
- Advertisement -

టాలీవుడ్ లో ఎంత మంది గొప్ప దర్శకులున్నా దర్శకుడు పూరి జగన్నాథ్ మాత్రం చాలా ప్రత్యేకమని చెప్పాలి. తనదైన శైలిలో సినిమాలు తీస్తూ.. ఒక హీరోను ఆకర్షించే విధంగా చూపించే రెండు నెలల్లోనే సినిమాను పూర్తి చేసే సత్తా ఉన్న దర్శకుడు పూరీ.ప్రస్తుతం పూరీజగన్నాథ్, బాలకృష్ణ కాంబినేషన్‌లో పైసా వసూల్ మూవీ విడుదలైన ఉన్న విషయం తెలిసిందే.

Neha Shetty in Puri Jagannadhi's film

పూరీ జగన్నాథ్ తన తదుపరి సినిమా తన తనయుడు ఆకాశ్ తో ఉంటుందని చెప్పారు. ప్రేమ కథాంశంగా ఈ సినిమా తెరకెక్కుతుందని అన్నారు. ఈ సినిమాలో ఆకాశ్ జోడీగా కొత్త హీరోయిన్ ను పరిచయం చేయనున్నట్టు చెప్పారు. ఆ పని పూర్తయిందనేది తాజా సమాచారం. ఈ సినిమా కోసం 200 మంది అమ్మాయిలకి ఆడిషన్స్ నిర్వహించిన తరువాత, ఒక అమ్మాయిని ఆయన ఫైనల్ చేశారట. ఆ అమ్మాయి పేరే ‘నేహా శెట్టి’.

ఫోటో షూట్ .. ట్రైల్ షూట్ కూడా కానిచ్చేసిన పూరీ, ఈ అమ్మాయిని ఖాయం చేసేశాడని అంటున్నారు. క్రితం ఏడాది కన్నడలో ‘ముంగారు మలే’ చేసిన ఈ అమ్మాయి, ఈ సినిమాతోనే తెలుగు తెరకి పరిచయమవుతోంది. పూరీ స్పీడ్ గురించి అందరికీ తెలిసిందే కనుక, సాధ్యమైనంత త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఎంతోమంది హీరోలకి హిట్స్ ఇచ్చిన పూరీ, తన తనయుడికి ఏ రేంజ్ హిట్ ఇస్తాడో చూడాలి.

- Advertisement -