టాలీవుడ్ టాప్ హీరోయన్ అక్కినేని సమంత వరుస సినిమాలతో బిజీగా ఉంది. అయితే సమంత సినిమాలతో పాటు ఫ్యామిలీ , ఫ్రెండ్స్ కు కూడా ఇంపార్టెన్స్ ఇస్తుంది. తాజాగా తన స్నేహితురాలి పెళ్లి వేడుకలో సందడి చేసింది సమంత. క్రైస్తవ సాంప్రదాయ పద్దతి జరిగిన ఈపెళ్లిలో సమంత మెరిసింది. సమంతతో పాటు మిగతా ఫ్రెండ్స్ అందరూ ఒకే డ్రెస్ లో దర్శనమిచ్చారు. ఈసందర్భంగా ఈఫోటోలను సమంత తన ఇస్టాగ్రామ్ లో షేర్ చేసింది. తన జీవితంలో ముఖ్యమైన ఫ్రెండ్స్ వీరే అని చెప్పింది.
ఈ చిత్రాల్లో వధువు తెలుపు రంగు దుస్తుల్లో మెరుస్తుండగా, సమంత సహా ఆమె స్నేహితులంతా నీలి రంగు వస్త్రాల్లో ఉన్నారు. సమంత ఇటివలే నాగచైతన్యతో కలిసి మజిలి సినిమాలో నటించింది. ఈసినిమా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సమంత దిల్ రాజు నిర్మిస్తున్న 96 మూవీ లో నటిస్తుండగా..నందినిరెడ్డి తెరకెక్కిస్తున్న ఓ బేబి మూవీ నటిస్తుంది.