నార‌ప్ప మూవీపై సమంత స్పందన..

140
Samantha Akkineni

వెంక‌టేష్‌, ప్రియ‌మ‌ణి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో శ్రీకాంత్ అడ్డాల తెర‌కెక్కించిన చిత్రం నార‌ప్ప‌. ఇటీవల ఓటీటీలో విడుద‌లైన హిట్‌ టాక్‌ తెచ్చుకుంది, ఈ చిత్రంపై ప‌లువురు సినీ ప్రముఖులు ప్ర‌శంస‌లు కురిపించారు. వెంక‌టేష్ ప‌ర్‌ఫార్మెన్స్‌ని తెగ పొగిడేశారు. అయితే తాజాగా స‌మంత అక్కినేని నార‌ప్ప చిత్రంపై స్పందించింది. తాజాగా చిత్రాన్ని వీక్షించిన స‌మంత త‌న స్పంద‌న‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో తెలియ‌జేసింది.

సినిమా బాగా నచ్చింద‌ని చెబుతూ.. నార‌ప్ప పోస్ట‌ర్‌ని షేర్ చేసింది. పోస్ట‌ర్‌పై వావ్‌..వావ్ వ్ వ్ వ్ వ్ అనే కామెంట్ పెట్టింది. కాగా, స‌మంత ఇటీవ‌ల ది ఫ్యామిలీ మ్యాన్ 2 అనే వెబ్ సిరీస్‌తో ఎంత‌గా అల‌రించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప్ర‌స్తుతం గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న శాకుంత‌లం చిత్రంలో న‌టిస్తుంది.