ఆకట్టుకుంటున్న ‘డియర్ మేఘ’ టీజర్..

15
Dear Megha Teaser

మేఘా ఆకాష్ – అరుణ్ ఆదిత్ – అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న తాజా చిత్రం ”డియర్ మేఘ”. సుశాంత్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు విడుదలైన ఫస్ట్ లుక్ – ఇతర పోస్టర్స్ ఈ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. అలానే ‘ఆమని ఉంటే పక్కన’ లిరికల్ సాంగ్ విశేష స్పందన తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా డియర్ మేఘ టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

టీజర్‌ను బట్టి, ‘ప్రేమతో నడిచింది ఒకరితో.. పెళ్లి కుదిరింది మరొకరితో’ అనే కాన్సెప్ట్ తో నడిచే కథగా అనిపిస్తోంది. “నిన్ను చూసినన్ని సార్లు బుక్స్ చూసుంటే క్లాస్‌లో టాపర్ అయ్యుండేదానిని”. “అతి ఎక్కువ సంతోషానికైనా .. అతి ఎక్కువ బాధకైనా కారణం ప్రేమే అవుతుంది” అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. దర్శకుడు ఈ టీజర్‌ను కట్ చేసిన తీరు బాగుంది. సున్నితమైన భావోద్వేగాలు.. లోతైన సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Dear Megha Official Teaser | Adith Arun | Megha Akash | Sushanth Reddy | Vedaansh Creative Works