సినిమాలకు సమంత గుడ్ బై…

180
samantha
- Advertisement -

ఎన్నో ఏళ్లుగా ప్రేమ‌లో ఉన్న అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత జంట గ‌త నెల‌లోనే పెళ్లి పీట‌లు ఎక్కిన విష‌యం తెలిసిందే. గోవాలో చాలా సింపుల్‌గా కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో పెళ్లి చేసుకున్న చై, సామ్ ప్ర‌స్తుతం హ‌నీమూన్‌లో ఉన్నారు. త్వ‌ర‌లోనే హైద‌రాబాద్‌లో భారీగా వీరి పెళ్లి రిసెప్ష‌న్ జ‌రుగ‌నుంది. ఆ త‌ర్వాత ఇప్ప‌టికే అంగీక‌రించిన సినిమాల షూటింగ్‌ల‌కు స‌మంత హాజ‌రుకానుంది.

samantha-ruth-prabhu-

స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతుండగానే… యంగ్ హీరో నాగచైతన్యను పెళ్లాడి అక్కినేని ఇంటి కోడలిగా మారిపోయింది సమంత. అయితే పెళ్లి తరువాత కూడా సినిమాల్లో నటించడం కొనసాగిస్తానని ఈ క్రేజీ హీరోయిన్ క్లారిటీ ఇచ్చింది. అక్కినేని ఫ్యామిలీ కూడా ఇందుకు అభ్యంతరం చెప్పకపోవడంతో… సమంత హవా మరికొన్నాళ్లు కొనసాగే అవకాశం ఉందని సినీజనం భావిస్తున్నారు. అయితే పెళ్లి తరువాత సమంత ఎంతకాలం హీరోయిన్‌గా కొనసాగుతుందనే విషయంలో మాత్రం ఎవరికీ అంతగా స్పష్టత లేదు.ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు పూర్తయిన తరువాత సమంత మెయిన్ హీరోయిన్‌గానే సినిమాలు ఒప్పుకుంటుందా అనే అంశంపై కూడా సస్పెన్స్ కొనసాగుతోంది.

samantha-ruth-prabhu-

ఇదిలా ఉంటే పెళ్లి తరువాత ఎంతకాలం సినిమాల్లో కొనసాగాలనే విషయాన్ని ఈ అందాల భామ ముందుగానే నిర్ణయించుకుందట. ఫ్యామిలీ లైఫ్‌లోకి పూర్తి స్థాయిలో ఎంటరైతే మళ్లీ సినిమాల్లో నటించడం కష్టమని భావించిన సమంత… పెళ్లి తరువాత రెండేళ్లు మాత్రమే సినిమాల్లో కొనసాగాలని డిసైడయ్యిందట. ప్రస్తుతం సమంత మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న `రంగ‌స్థ‌లం 1985` సినిమాలో నటిస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ చాలా భాగం పూర్త‌యింది. స‌మంత కాంబినేష‌న్‌లో కొన్ని సీన్లు చిత్రీక‌రించాల్సి ఉంది.

- Advertisement -