నాగ్ -ఎన్టీఆర్ లతో టబు..?

188
Trivikram Keen on Roping Nag’s Lady
- Advertisement -

హీరోయిన్ టబు పేరు చెప్పగానే తెలుగు వారికి ముందుగా గుర్తొచ్చేది ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా. ఆ సినిమా తర్వాత నాగార్జున, టబు హాట్ ఫేవరెట్ జోడీ అయిపోయారు. అప్పట్లో వీరి మధ్య ఎఫైర్ ఉన్నట్లు కూడా వార్తొలొచ్చాయి. 45 ఏళ్ల వయసొచ్చినా ఇప్పటికీ పెళ్లి దూరంగా ఉన్న ఈ భామకు ఇప్పటికీ తెలుగు సినిమాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి.  రామ్ గోపాల్ వర్మ, నాగార్జున కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో టబు నటిస్తుందనే వార్తలు వస్తున్నాయి.

Nagarjuna-

అంతే కాకుండా ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా టబు నటిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో టబు ను ఎన్టీఆర్.. టబు విషయంలో సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. సినిమాలో ఎన్టీఆర్ పాత్రతో సరి సమానంగా ఎంతో పవర్‌ఫుల్‌గా ఉండే ఆ పాత్ర కోసం టబు కాకుండా వేరొకరిని తీసుకోవాలంటూ ఎన్టీఆర్ త్రివిక్రమ్‌ని కోరాడని అంటున్నారు.

nagarjuna-and-tabu

అంతేకాదు ఎన్టీఆర్ మాటమీద త్రివిక్రమ్ కూడా ఆ పాత్ర కోసం వేరే నటిని వెతికే పనిలో పడ్డారని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఆ అవకాశం ఎవరికిస్తారనేది ఖచ్చితంగా తెలియాలంటే మరికొద్ది రోజులు పట్టొచ్చు.

- Advertisement -