టాలీవుడ్ నుంచి హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బీజీగా గడుపుతున్నారు. తాజాగా పాన్ ఇండియా స్టార్‌గా ఎదుగుతున్న సమంత బాలీవుడ్ మోస్ట్ పాపులారిటీ షో లో పాల్గోంటున్నారు. కాఫీ విత్ కరణ్ ఏడవ సీజన్‌లో భాగంగా ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహర్ హోస్ట్ గా చేసే ఈ షో లో ప్రముఖ బాలివుడ్ నటుడు అక్షయ్ తో కలిసి సందడి చేయనున్నారు. సామ్ ఎపిసోడ్ కోసం టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఈ షోలో సమంత తన వ్యక్తిగత విషయాలపై పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తన పెళ్ళి, విడాకులపై వచ్చిన ట్రోల్స్‌పై తనదైన శైలిలో స్పందించింది. ఈ క్రమంలోనే నాగచైతన్యతో విడాకుల తర్వాత తను భరణంగా రూ.250 కోట్లు తీసుకున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. అలాంటి వార్తలు వచ్చినప్పుడు తన ఇంటికి ఎవరైనా ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు వస్తే బాగుండేదని, వాళ్లైనా జనాలకు నిజం చెప్పేవారని అనుకునేదాన్నని తెలిపింది. అంతేకాకుండా ఈ షోలో కరణ్.. రామ్ చరణ్ గురించి ఒక్క మాటలో చెప్పాలని అడుగగా.. దానికి సమంత ఒరిజినల్ గ్యాంగ్‌స్టార్ అంటూ ట్యాగ్ ఇచ్చింది. వీటితో పాటుగా టాలీవుడ్ నెపోటిజంపై కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్‌లో చాలా మంది హీరోల పిల్లలు, వారి బంధువుల పిల్లలు మాత్రమే హీరోలు అవుతారు. కానీ విజయ్ దేవరకొండ లాంటి వ్యక్తులు స్టార్‌గా మారడం చాలా అరుదు అంటూ చెప్పుకొచ్చింది.