Samantha:సమంత వాటిని కొనడం మానేసింది

36
- Advertisement -

సమంత గురించి ప్రస్తుతం ఓ వార్త వినిపిస్తోంది. ఆమె ఇంట్లో పదుల సంఖ్యలో హ్యాండ్ బ్యాగ్ లు ఉన్నాయట. సహజంగా హీరోయిన్లు ఎక్కడికి వెళ్లినా త‌మ డ్రెస్ లోకి మ్యాచ్ అయ్యే హ్యాండ్ బ్యాగ్ ను తీసుకెళ్ల‌డం వారికి అలవాటు. పైగా ఈ హ్యాండ్ బ్యాగ్ ల‌ను కొన‌డానికి హీరోయిన్లు భారీగా ఖర్చు చేస్తారు. గతంలో సమంత అక్కినేని ఇంటికి కోడలు కాబట్టి, ఆ సమయంలో ఆమె ఈ హ్యాండ్ బ్యాగ్ లను విపరీతంగా కొనేసింది. అక్కినేని ఫ్యామిలీ స్థాయికి త‌గ్గ‌ట్టుగా సమంత ఖ‌ర్చు పెట్టింది. పెట్టాలి కూడా తప్పదు. ఎందుకంటే.. మీడియా క‌ళ్లు హీరోయిన్ల హ్యాండ్ బ్యాగ్ ల‌పైనే ఉంటాయి.

అందుకే, వీటిని హీరోయిన్లు ఎప్ప‌టిక‌ప్పుడు అప్ గ్రేడ్ చేయాల్సిందే, అలాగే అవి స్టైల్ స్టైల్ గా ఉండాల్సిందే! ఇందు కోసం స్టార్ హీరోయిన్లు భారీ మొత్తాల‌ను ఖ‌ర్చు చేస్తారు. ఇలాంటి జాబితాలో సమంత ముందు వరుసలో నిలుస్తోంది. ఎప్ప‌టిక‌ప్పుడు స్టైలిష్ హ్యాండ్ బ్యాగ్ లో క‌నిపించే సమంత వీటి కోసం కోట్ల రూపాయ‌ల‌ను వెచ్చిస్తుంద‌ట‌! ఫ్రాన్స్, ఇట‌లీ వంటి దేశాల నుంచి సమంత లెద‌ర్ బ్యాగ్ ల‌ను తెప్పించుకుంటూ ఉంటుందట. వాటి ధ‌ర‌లు క‌ళ్లు చెదిరేస్థాయిలో ఉంటాయి. ఒకే బ్రాండ్ లో కూడా క‌నీసం నాలుగు ల‌క్ష‌ల రూపాయ‌ల‌తో మొద‌లుపెట్టి, కోటి రూపాయ‌ల ధ‌ర పలికే బ్రాండ్లు ఉంటాయి. అయినా, సమంత గతంలో వెనక్కి తగ్గేది కాదు.

కానీ, గత ఏడాది నుంచి సమంత ఒక్క హ్యాండ్ బ్యాగ్ కూడా కొనలేదు. అయినప్పటికి, సమంత వ‌ద్ద డ‌జ‌న‌కు పైగా బ్యాగులు ఉన్నాయ‌ట. మ‌రి వీటి మొత్తం ధ‌ర ఎంత అంటే.. కోట్ల రూపాయ‌ల్లోనే అని అంచ‌నా! సమంత వ‌ద్ద ఉన్న అన్ని హ్యాండ్ బ్యాగ్ క‌లెక్ష‌న్ విలువ రెండు మూడు కోట్ల రూపాయ‌ల పై స్థాయిలోనే ఉండ‌వ‌చ్చ‌ని ఫ్యాష‌న్ ఎక్స్ ప‌ర్ట్స్ చెబుతున్నారు! సమంతకు ఈ విష‌యంలో మంచి పోటీ ఇచ్చే హీరోయిన్లు కూడా టాలీవుడ్ లో లేరు. అలాంటి సమంత ప్రస్తుతం హ్యాండ్ బ్యాగ్ లను కొనే ఆలోచనలో లేదు.

Also Read:రస్టిక్‌ థ్రిల్లర్‌.. ‘మంగళవారం’

- Advertisement -