ఆ తెలుగు హీరోయిన్ నిర్వేదం

30
- Advertisement -

ఎవరు ఏమన్నా.. తెలుగు ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకు అవకాశాలు ఎక్కువ ఇవ్వరు. అమ్మడు అందంలో మేటి అయినా, ఎందుకో చిన్న చూపే చూస్తారు. అలాంటి కోవకు చెందిన బ్యూటీనే ‘ఈషా రెబ్బా’. కెరీర్ సంగతి ఎలా ఉన్నా.. తర్వాత సినిమాలు ఎలా తెచ్చుకోవాలా అనే ప్రయత్నాలను ఈషా రెబ్బా ఎప్పటికప్పుడు చాలా సీరియస్ గా చేస్తోంది. అందుకోసం కొందరు దర్శకులతో కూడా ఆమె చనువుగా ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది నిజమేనా ? అని అగిడితే.. ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు ఇవ్వడానికి హీరోయిన్ల వేళ్లు, కాళ్లు పట్టుకోవడం మామూలే కదా అంటుంది ఈషా రెబ్బా.

ఈషా రెబ్బా ఇంకా మాట్లాడుతూ.. హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిపోవాలంటే అందం ఒక్కటే సరిపోదు.. ప్లానింగ్ కూడా ఉండాలి. వచ్చిన అవకాశాలను వాడుకునే తెలివితేటలూ ఉండాలి. అవసరం అనుకుంటే.. అవకాశాలను కూడా సృష్టించుకునే తెగువ, ఓపిక కూడా ఉండాలి. ఇన్ని ఉంటేనే హీరోయిన్ గా కెరీర్ ఉంటుంది, స్టార్ డమ్ ఉంటుంది అంటూ ఈషా రెబ్బా మొత్తానికే పెద్ద లెక్చరరే దంచింది. సినిమాల్లో సక్సెస్ రాకపోయినా, సక్సెస్ కావడానికి ఏం చేయాలో అనే తత్త్వం మాత్రం ఈషా రెబ్బాకి బాగా బోధ పడినట్లు ఉంది. పాపం ఈషా రెబ్బా ఎన్ని సినిమాలు చేసినా ఆమెకు కలిసి రావడం లేదు.

నిజానికి ఈషా రెబ్బా కి అదృష్టం కలిసొచ్చి మొదట్లో అవకాశాలు విపరీతంగా వచ్చినా.. ఆ తర్వాత కెరీర్ పరంగా తీసుకున్న కొన్నిరాంగ్ డెసిషన్స్ కారణంగా ఆ హీరోయిన్ క్లిక్ అవ్వలేక మధ్యలోనే ట్రాక్ తప్పుతుంది. అలా మధ్యలోనే ట్రాక్ తప్పి.. ఇప్పుడు ఇబ్బందులు పడుతుంది. తీరా వయసు ముదిరిపోయాక ఇప్పుడు తీరిగ్గా నలుగుర్ని ఆకర్షించేందుకు ఈషా రెబ్బా అందాల ఆరబోతనే నమ్ముకుని.. అవసరం ఉన్నా లేకపోయినా ఫుల్ ఎక్స్ పోజింగ్ తో ముందుకు వెళ్తుంది. బోల్డ్ పాత్రలు దొరకనప్పుడు ఎవరైనా ఇదే చేస్తారు. కాకపోతే ఈషా రెబ్బా పాత్ర బోల్డ్ కాకపోయినా.. తానూ బోల్డ్ అంటుంది. మొత్తమ్మీద ఈషా రెబ్బా నిర్వేదంలో ఉంది.

Also Read:రస్టిక్‌ థ్రిల్లర్‌.. ‘మంగళవారం’

- Advertisement -