స్టార్ హీరోయిన్ సమంత వయోసైటిస్ అనే వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆమె వెల్లడించింది. ఆమె త్వరగా కొలుకోవాలని చిత్ర పరిశ్రమ కొరుకుంటోంది. తగ్గుతుందా? చికిత్స ఉందా? అనే ప్రశ్నలు చాలా మందిలో మెదులుతున్నాయి
వయోసైటిస్ ప్రమాదకరమా? గూగుల్ లో ఇప్పుడు దీని గురించే వెతుకుతున్నారు. మయోసైటిస్‌నే పాలి మయోసైటిస్‌గా కూడా వ్యవహరిస్తారు. ఆటో ఇమ్యూన్ కారణంగా వచ్చే పాలి మయోసైటిస్ వల్ల భుజాలు, తుంటి వద్ద కండరాల క్షీణత ఉంటుంది. కూర్చుంటే పైకి లేవలేరు. చిన్న పిల్లల్లో 5-15 ఏళ్ల వారికి, పెద్దవాళ్లలో 45-65 ఏళ్ల వారికి ఎక్కువ కన్పిస్తుంది.
కొన్ని బయోకెమిస్ట్రీ పరీక్షల ద్వారా మయోసైటిస్‌ను గుర్తిస్తారు. ఎలక్ట్రోమయోగ్రఫీ పరీక్షతో కండర దృఢత్వాన్ని తెలుసుకొని వ్యాధిని అంచనా వేస్తారు. అయితే వయోసైటిస్ కు చికిత్సలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. త్వరగా దీన్ని గుర్తిస్తే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు.లేదంటే ఊపరితిత్తులపై ప్రభావం చూపి, పల్మనరీ పైబ్రోసిస్‌కు దారితీస్తుంది.
ఇవి కూడా చదవండి