చైతూని ఏడిపించిన సమంత..

405
Samantha
- Advertisement -

ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సమంత..ఒక్కో మెట్టు ఎక్కుతూ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా మారింది. అందం, అభినయం, నటన ఇలా తనదైన ప్రతిభతో దక్షిణాది ప్రేక్షకులకు చాలా దగ్గరైంది. తమిళ భామగా అరంగేట్రం చేసిన సామ్..నాగ చైతన్య ప్రేమతో..తెలుగింటి  కోడలుగా  మారిపోనుంది. త్వరలో అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకోబోతున్న చైతన్య బుధవారం సాయంత్రం  ఫేస్‌బుక్‌ లైవ్‌చాట్‌లో పాల్గొంది. ఆ సందర్భంగా ఓ అభిమాని ‘తెరి’ (తెలుగులో పోలీస్‌) సినిమాలో నటన గురించి మాట్లాడాడు. ఆ సినిమాతో అందరినీ ఏడిపించారు కదా అని ప్రశ్నించాడు.

Samantha
అభిమాని ప్రశ్నకు సమంత..ఎలాంటి సమాధానం చెప్పిందో తెలుసా..పోలీస్ సినిమాకు‘దర్శకుడు అట్లీ ఆ సన్నివేశం గురించి నాతో చెప్పినపుడే.. ‘థియేటర్‌లో అందరూ ఏడ్చేలా నా ప్రయత్నం చేస్తాన’ని చెప్పా. అది నిజంగా జరిగింది. అది నా విజయంగానే భావిస్తున్నా. ఆ సినిమా చూసేందుకు నా స్నేహితులు, చైతూతో కలిసి ఓ థియేటర్‌కు వెళ్లా. ఆ సీన్‌ వస్తున్నపుడు స్ర్కీన్‌ వైపు కాకుండా థియేటర్‌లో ఉన్న జనాల వైపు చూస్తూ కూర్చున్నా. ఆ సీన్‌ వస్తున్నపుడు అందరూ భావోద్వేగంతో ఉన్నారు. నా పక్కనే కూర్చున్న చైతూ కూడా ఆ సన్నివేశంలో నన్ను అలా చూసి ఏడ్చేశాడు. నిజంగా ఆ సీన్‌ గురించి అట్లీ నాకు వివరిస్తున్నపుడు అందర్నీ ఏడిపించాలనుకున్నా.. ఏడిపించాన’ని చెప్పింది సమంత.

Samantha

2016లో నాలుగు సినిమా విజయాలతో తెగ సందడి చేసిన సమంత..వచ్చే ఏడాది లో కూడా చేతి నిండా సినిమాలతో బిజీగా కానుంది. ఒకటి కాదు రెండు ఐదు సినిమాలను అంగీకరించినట్టు సమంత తెలియజేసింది. అవన్నీ మంచి కథలేనని చెప్పింది. మీ డ్రీమ్ డైరెక్టర్ ఎవరని అభిమాని అడిగిన ప్రశ్నకు మణిరత్నం అంటూ సామ్ ట్వీట్ చేసింది. మణిరత్నం దర్శకత్వంలో నటించాలనే డ్రీమ్‌ తప్ప తనకి సినిమాల పరంగా వేరే కోరికలు లేవని చెప్పింది.

- Advertisement -