ఎక్స్ పోజింగ్ ఏమిటి ? ఏమైనా చేస్తానంటుంది

70
- Advertisement -

కేరళ కుట్టి నివేదా థామస్ కి సౌత్ ఇండియా అంతా గుర్తింపు ఉంది. చేసింది తక్కువ సినిమాలే అయినా, ఆమె నటనకు, ఆమె హోమ్లీ నెస్ కు సౌత్ ఇండస్ట్రీ అంతా ఫిదా అయింది. మొత్తానికి ‘కన్నులతోనే ఎక్స్ ప్రెషన్స్ పలికించి’ నివేదా థామస్ ఫుల్ పాపులారిటీ కొల్లగొట్టింది. ఒక్కసారిగా ఫేమస్ హీరోయిన్ అయిపోయింది. ఐతే, నివేదా థామస్ నటించిన సినిమాలు మాత్రం పెద్దగా ఆడలేదు. రెజీనా తో ఆమె చేసిన సోలో సినిమా శాకిని డాకిని కూడా బాగా నిరాశ పరిచింది.

శాకిని డాకిని తర్వాత నివేదా థామస్ కి అవకాశాలు కూడా తగ్గాయి. ఇక తెలుగులో సోలో హీరోయిన్ గా చేసిన జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్ కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. ఇప్పుడు నివేదా థామస్ పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఐతే, నివేదా థామస్ లో ఈ మధ్య బాగా మార్పు వచ్చిందని, ఇక నుంచి గ్లామర్ రోల్స్ చేయాలనీ ఆమె తెగ ఉబలాట పడుతుంది అని తెలుస్తోంది. నివేదా థామస్ నేరుగా దర్శకులకు, దిల్ రాజు లాంటి నిర్మాతలకు ఫోన్ చేసి.. ఎలాంటి గ్లామర్ రోల్స్ అయినా చేస్తానని, అవసరం అయితే బికినీ వేయడానికి కూడా ఎలాంటి అభ్యంతరం లేదు అని చెబుతుందట.

నిజానికి నివేదా థామస్ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అసలు ఎక్స్ పోజింగ్ ఎందుకు చేయాలి ?, హీరోయిన్లు ఎక్స్ పోజింగ్ చేస్తున్నారు అంటే.. అది వారి చేతగాని తనం. నటన వస్తే.. నటించాలి. అప్పుడే మంచి పాత్రలు వస్తాయి. తాను మాత్రం ఎన్నటికీ దిగజారి ఎక్స్ పోజింగ్ చేయను అన్నట్టు అప్పుడు నివేదా థామస్ మాట్లాడింది. ఇప్పుడు మాత్రం ఎక్స్ పోజింగ్ ఏమిటి ? ఏమైనా చేస్తానంటుంది. సినీ మాయ అంటే ఇదేనేమో.

- Advertisement -