సమంత @ 11 మిలియన్స్

210
samantha

తెలుగు .. తమిళ భాషల్లో సమంతా అగ్రకథానాయికగా వెలుగొందుతోంది. గ్లామర్ కు .. నటనకు సమ ప్రాధాన్యతను ఇవ్వడం వల్లనే ఆమె ఈ స్థానానికి చేరుకుంది. ఇకపై నటనకి ఎక్కువ ప్రాధాన్యత వుండే పాత్రలను మాత్రమే చేస్తానని ఆమె ఇటీవల చెప్పింది. అంతేకాదు విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ, తనని తాను కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తానని అంది.వెండితెరపైనే కాదు .. సోషల్ మీడియాలోను సమంతా చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. అందువల్ల ఆమె ఫాలోవర్స్ సంఖ్య ఎక్కువగానే వుంటుంది.

తాజాగా ఇన్‌స్టాగ్రాములో సమంతను ఫాలో అయ్యేవారి సంఖ్య 11 మిలియ‌న్స్‌కు చేరింది. హీరోలతో స‌మానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ వెళుతున్న స‌మంత త‌క్కువ టైంలోనే ఇంత మంది ఫాలోవ‌ర్స్‌ని సొంతం చేసుకోవ‌డం

ప్రస్తుతం ఫ్యామిలీ మ్యాన్ 2 అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్న సామ్‌….తన వ్యవసాయ క్షేత్రంలో కురగాయాలను పండించడం వంటి పనులతో బిజీగా ఉంది.