సినీ నటులు అక్కినేని నాగచైతన్య, సమంత దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో నాగచైతన్య దంపతులకు పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఇక సమంత,చైతన్య నటించిన తాజా చిత్రం మజిలీ. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో సమంత,చైతుతో పాటు చిత్ర యూనిట్కి సంబంధించిన కొందరు కాలినడకన అలిపిరి నుండి తిరుమలకి వెళ్ళారు. సామాన్య భక్తులతో కలిసి సమంత ఏడు కొండలు ఎక్కారు. మధ్య మధ్యలో అభిమానులతో సెల్ఫీలు దిగారు. కేవలం రెండు గంటలలోనే సమంత తిరుమల కొండకు చేరుకున్నట్టు తెలుస్తుంది.
అలాగే వీరుతో పాటు హాస్య నటుడు బ్రహ్మానందం కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి దర్శనం కోసం తిరుమల ఆలయంలోకి వెళుతున్న సమయంలో సమంత, నాగచైతన్యలని ఫోటోగ్రాఫర్స్ తమ కెమెరాలలో బంధించారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.