సమంత రేటుకు దిల్‌రాజు షాక్‌..!

297
samantha dil raju

దక్షిణాది అగ్ర హీరోయిన్లలో అందాలతార సమంత ఒక‌రు‌. సామ్ న‌టించిన సినిమాల‌న్ని సూప‌ర్ డూప‌ర్ హీట్ల‌ను సొంతం చేసుకుంటున్నాయి. తాజాగా సమంత నటించిన మజిలీ మంచి వసూళ్లను రాబడుతోంది. ఇప్పటివరకు హీరోల చాటుగా హీరోయిన్‌గానే మిగిలిపోయిన సమంత ప్రస్తుతం సోలోగా తన టాలెంట్‌ని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తోంది.

కథ ఎంపికలో జాగ్రత్త తీసుకుంటూ ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది. రంగస్థలంలో రామలక్ష్మీగా ఫిదా చేసిన సామ్‌ తర్వాత యూ టర్న్‌ సినిమాలో సోలోగా నటించి మెప్పించింది. సినిమా భారీ వసూళ్లను రాబట్టడంలో కీ రోల్ పోషించింది. ఇక పెళ్లి తర్వాత తొలిసారి నాగచైతన్యతో మజిలి సినిమా చేసి సామ్‌ తన నటనతో సినిమాను మరో స్ధాయికి తీసుకెళ్లి టాలీవుడ్ బంగారు బాతుగా మారింది.

వరుస సినిమాలు హిట్ అవుతుండటంతో రెమ్యునరేషన్‌ను అమాంతం పెంచేసింది. ఒక్కో సినిమాకు రూ.2.5 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు పారితోషికం తీసుకోవాలని సమంత భావిస్తోందట. మజిలి తర్వాత తనను సంప్రదించిన నిర్మాతలకు ఇదే విషయాన్ని తేల్చి చెప్పేసిందట.

నాని,సుధీర్ బాబు హీరోలుగా తెరకెక్కుతున్న సినిమాలో నటించాల్సిందిగా సామ్‌ను సంప్రదించగా ఆమె ఆడిగిన రెమ్యునరేషన్‌ చూసి దిల్ రాజు షాకయ్యాడట. మొత్తంగా వరుస హిట్ సినిమాలతో సమంత తన పారితోషికాన్ని అమాంతం పెంచేసిన సామ్‌కు అవకాశాలు ఏ మేరకు కలిసి వస్తాయో వేచిచూడాలి.