మహేష్ 25 కోసం…24 మంది దర్శకులొస్తున్నారు..!

201
mahesh babu

సూపర్ స్టార్ మహేష్ బాబు-వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మహర్షి. మే 9న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుండగా ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలనే వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఉగాదికి టీజర్‌ని విడుదల చేసిన చిత్రయూనిట్ తర్వాత ఒక్కో పాటను విడుదల చేస్తూ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.

ఇక ప్రమోషన్ కార్యక్రమాలకు తోడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. మహేష్‌కు ఇది 25వ సినిమా కావడంతో ఇప్పటివరకు చేసిన 24 సినిమాల దర్శకులను ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు తీసుకొచ్చేలా రంగం సిద్ధం చేస్తున్నారు.

మే 1న హైదరాబాద్ – నెక్లెస్ రోడ్ లోని ‘పీపుల్స్ ప్లాజా’లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఫంక్షన్‌కు స్పెషల్ గెస్ట్‌ ఎవరొస్తారనేది సస్పెన్స్‌గా ఉంచారు.

ఈసినిమాలో మహేశ్ డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈసినిమా నుంచి విడుదలైన సాంగ్స్,, ఫస్ట్ లుక్ లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈమూవీపై భారీగా ఆశలు పెట్టుకున్నారు మహేశ్ అభిమానులు. అల్లరి నరేష్‌ కీలకపాత్రలో నటిస్తుండగా మహేష్ బాబుకు జోడీగా పూజ హెగ్డే కనిపించనుంది.