కవిత‌కు నటి సమంత సాయం..

109
Actress Samantha
- Advertisement -

అక్కినేని వారి కోడలు, హీరోయిన్ సమంత మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. సంగారెడ్డి జిల్లా మనూరు మండలం డోవూర్‌ చందర్‌ నాయక్‌ తండాకు చెందిన ఆటో డ్రైవర్‌ కవితకు సమంత ఊహించని బహుమతిని అందజేసింది. ఓ షోరూం నుంచి ఫోన్‌కాల్‌ రిసీవ్‌ చేసుకున్న కవిత.. ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. కవిత కష్టాన్ని గుర్తించిన సమంతా ఆమెకు ఓ స్విఫ్ట్ కారును కానుకగా అందించారు.

కవిత కుటుంబ పోషణ కోసం ఆటో డ్రైవర్ అవతారం ఎత్తింది. తల్లిదండ్రులు సహా పది మందితో కూడిన కుటుంబాన్ని తన రెక్కల కష్టంతో పోషిస్తోంది. మగవాళ్లకే పరిమితం అని భావించే ఆటో డ్రైవింగ్‌ను నేర్చుకుని, హైదరాబాదులోని మియాపూర్, పరిసర ప్రాంతాల్లో తిప్పుతోంది. కవిత కష్టాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న సమంత, ఆమెకు కారును గిఫ్టుగా ఇచ్చారు. తద్వారా మరింత మెరుగైన ఉపాధికి బాటలు వేశారు.

- Advertisement -