- Advertisement -
హీరో నాగచైతన్యపై ఫన్నీ సెటైర్ చేసింది సమంత. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో రానా-మిహీకాల ఎంగేజ్మెంట్ జరుగగా ఈ కార్యక్రమానికి భర్త చైతూతో కలిసి హాజరైంది సామ్.
ఈ సందర్భంగా చైతూతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసిన సమంత …తన భర్తపై ఫన్నీ కామెంట్స్ చేసింది. మమ్మీ, ఆంటీస్, ఫ్రెండ్స్, సిస్టర్స్ అందరిని పంపిన తర్వాత ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ టైం వచ్చింది. నా భర్త చాలా అందంగా కనిపిస్తున్నారు కదా?( భర్త ఎక్కడో పెద్ద గొయ్యి తవ్వుతున్నాడు) అంటూ ఫన్నీ కామెంట్‌ను పోస్టు చేసింది.
దీనికి స్పందించిన నాగచైతన్య …ఇదేదో ఇతరుల భాగస్వామ్యంతో చేసిన పెయిడ్ పోస్ట్‌లలో ఒకటిగా కనిపిస్తుందని అన్నారు. ఏదిఏమైనా ఇప్పుడు సామ్ చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
https://www.instagram.com/p/CAeVGl5hiQA/
- Advertisement -